శ్రీ. రాజ్ కుమార్, ఫుల్ వారియా దేవ్ ఔరంగాబాద్ 3 చక్రాల వాహనం రుణం – అతుల్ జెమ్ ప్యాసింజెర్
నేను ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా 2 సంవత్సరాలు పనిచేశాను. అయితే డబ్బు అవసరం వల్ల నేను ప్రయివేట్ కారు డ్రైవర్‌గా బాగా పనిచేసేవాడిని.
ఢిల్లీలో 2 సంవత్సరాల తరువాత, నేను ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. 50 వేల రూపాయల పొదుపు మొత్తంతో, నేను ఔరంగాబాద్, బీహార్‌లో స్క్రాప్ వ్యాపారం చేయడం ప్రారంభించాను, అయితే అనుకున్నవిధంగా జరగలేదు, దీనివల్ల వ్యాపారంలో నేను పొదుపు చేసిన మొత్తాన్నికోల్పోయాను. 2 సంవత్సరాల క్రితం నేను డ్రైవర్‌గా పని చేసిన అదే స్థానానికి నేను వెళ్లలేకపోయాను, అలానే నా ఆత్మవిశ్వాసం కూడా కాస్తంత దెబ్బతింది. నేను మళ్లీ టెంపో డ్రైవింగ్ చేయడం ప్రారంభించాను (3 వీలర్)
నేను టెంపో డ్రైవర్‌గా పని చేయడం ద్వారా సంపాదించే చిన్న మొత్తాలను పొదుపు చేసి, నేను రూ. 60,000 చేయగలిగాను మరియు 3 చక్ర వాహనం కొనుగోలు చేయడానికి రుణం కొరకు చూడటం మొదలు పెట్టాను. చాలా ఆర్థిక సంస్థలు నాకు రుణం ఇవ్వడాన్ని తిరస్కరించాయి అయితే నేను నా ఆశను కోల్పోలేదు. చివరిగా నేను మహీంద్రా ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లను కలిశాను, వారు నాకు రుణం ఇచ్చేందుకు అంగీకరించారు. వారికి ధన్యవాదాలు, నేను ఇప్పుడు ఒక వాహనానికి యజమానిని. అప్పటి నుంచి, నా సంపాదన గణనీయంగా పెరిగింది,.అలానే సమాజంలో గౌరవం కూడా పెరిగింది. ఇవాళ, నా పట్ల నేను మరింత ఆత్మవిశ్వాసంగా ఉన్నాను మరియు మొదటి రుణం తిరిగి చెల్లించిన వెంటనే రెండో వాహనం కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్నాను.
నా స్వంత దేశంలో ఎదిగేందుకు సహాయపడినందుకు మహీంద్రా ఫైనాన్స్‌కు నేను రుణపడి ఉంటాను.