సబ్సిడరీలు

మహీంద్రా ఫైనాన్స్ వద్ద , మేం చేసే ప్రతి పనిలోనూ ఖాతాదారుల అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది మా విజన్. మా కుటుంబాన్ని విస్తరించడానికి మరియు నిపుణుల ద్వారా మెరుగైన సేవల ద్వారా మా ఖాతాదారులకు మరింత విలువను అందించడానికి మాకు స్ఫూర్తిని అందిస్తుంది. మా రెండు విజయవంతమైన వెంచర్‌లు గుర్తించి ఇదిగో క్లుప్తంగా- మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ మరియు మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, మా ఎదుగుతున్న కుటుంబంలో భాగంగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది.

Brokers

మన జీవితాల్లో ఊహించని ఘటనలకు విరుద్ధంగా రక్షణ కల్పించడం అనేది నేడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం. ఈ ఆవశ్యకతను అర్ధం చేసుకొని, మా సబ్సిడరీ మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (MIBL), మా విభిన్న కన్స్యూమర్ బేస్‌లోని వైవిధ్యభరితమైన అవసరాలు మరియు రిస్క్ ప్రొఫైల్స్ కొరకు పూర్తి స్థాయి బీమా పరిష్కారాలను అందిస్తుంది. 1.3 మిలియన్ రిటైల్ కస్టమర్ బేస్‌కు ప్రత్యేక బీమా బ్రోకింగ్‌ని అందించడంతోపాటుగా, పెద్ద సంఖ్యలో కార్పొరేట్ కస్టమర్‌లకు సేవలందిస్తోంది, కంపెనీ జీవిత బీమా మరియు జీవిత బీమాయేతర సెగ్మెంట్‌ల్లోనూ విస్త్రృతశ్రేణి ప్లాన్‌లను అందిస్తోంది.

అత్యంత సవిస్తరమైన మరియు క్రమబద్ధమైన రీతిలో ఖాతాదారుల బీమా అవసరాలు మరియు రిస్క్ ప్రొఫైల్ అర్ధం చేసుకోవడం ద్వారా తమ ఖాతాదారులకు విలువను అందించేందుకు MIBL కట్టుబడి ఉంది. మరింత సృజనాత్మక, ఖర్చు తక్కువ. మరియు కస్టమైజ్ చేయబడ్డ బీమా పరిష్కారాలను అందించడానికి సహాయపడుతుంది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో ఎలాంటి రాజీ పడకపోవడం ద్వారా క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ కొరకు ప్రఖ్యాత ISO 9001:2008 సర్టిఫికేషన్ పొందిన అతి కొద్ది సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

మే 2014లో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ మరియు డెవలప్‌మెంట్ అథారిటీ (IRDA) ద్వారా MIBL ద్వారా డైరెక్ట్ బ్రోకర్ లైసెన్స్ మంజూరు చేయబడింది, తద్వారా జీవిత మరియు జీవిత బీమాయేతర వ్యాపారాల్లో డైరెక్ట్ బీమా బ్రోకరింగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. దీనికి అదనంగా, ఖాతాదారులకు కస్టమైజ్డ్ పరిష్కారాలను అందిస్తామనే తన వాగ్దానాన్ని సంతృప్తి పరచడానికి వివిధ పబ్లిక్ మరియు ప్రయివేట్ బీమా కంపెనీలతో MIBL ఎంపానెల్ అయింది. సెప్టెంబర్ 2011లో, IRDA ద్వారా MIBLకు కాంపోజిట్ బ్రోకర్ లైసెన్స్ మంజూరు చేయబడింది, తద్వారా డైరెక్ట్ బ్రోకింగ్‌తో పున:బీమా బ్రోకింగ్ వ్యాపారంలోని ప్రవేశించేందుకు ఆస్కారం ఏర్పడింది. మొత్తం మీదగా ఇన్స్యూరెన్స్ రిస్క్ సొల్యూషన్ ప్రొవైడర్ వలే, ఖాతాదారుల రిస్క్ మేనేజ్‌‌మెంట్ ప్రొఫైల్‌లో కూడా MIBL ఒక కీలక పాత్ర పోషిస్తుంది.

మా విజన్:

"2015 నాటికి రెవిన్యూలో భారతదేశపు నెంబరు 1 బీమా బ్రోకర్‌గా మారడం."

వ్యూహాత్మక భాగస్వామ్యం

సెప్టెంబర్ 2012లో, మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (MIBL), సింగపూర్ మరియు మలేషియాలో ప్రారంభించబడ్డ లీప్ ఫ్రాగ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫండ్ యొక్క ఇన్‌క్లూజన్ ఫండ్ యొక్క సబ్సిడరీ అయిన ఇన్‌క్లూజన్ రిసోర్స్ ప్రయివేట్ లిమిటెడ్ (IRPL)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది మరియు మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MMFSL), దాని మాతృసంస్థలు IRPL యొక్క అంతర్జాతీయ నాలెడ్జ్ మరియు అనుభవం ద్వారా, మరి ముఖ్యంగా మాస్క్ మార్కెట్‌ల్లో బీమా అందించడానికి అతి తక్కువ ఖర్చు టెక్నాలజీ పరిష్కారాలను ఉపయోగించడం ద్వారా భారతదేశంలోని గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉండే ఖాతాదారులకు కంపెనీ సేవల్ని విస్తరించడం జరిగింది. దీనికి అదనంగా, IRPL యొక్క అనుభవం మరియు అంతర్జాతీయంగా పున:బీమాలో ఉండే అసోసియేషన్ ద్వారా, కంపెనీ పున:బీమా బ్రోకింగ్ వ్యాపారంలో సాయం చేయడానికి అంతర్జాతీయంగా ఉన్న పున:బీమా కంపెనీలతో అనుసంధానం చేయడానికి దోహదపడింది.

ఆసియా, ఆఫ్రికాల్లోని దారిద్ర్యరేఖకు దిగువన ఉండే వారికి బీమాని అందించే కంపెనీల్లో లీప్ ఫ్రాగ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫండ్ అనేది ప్రపంచంలోనే మొదటి మరియు అతి పెద్ద పెట్టుబడిదారుడు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC), యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (EIB), KfW డెవలప్‌మెంట్ బ్యాంకు, జర్మనీ, FMO డెవలప్‌మెట్ బ్యాంక్ ఆఫ్ ద నెథర్లాండ్స్ మొదలైన సంస్థలు పెట్టుబడిదారులుగా ఉన్నాయి. లీప్ ఫ్రాగ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫండ్‌కు మాస్ మార్కెట్ బీమాపై స్పెషలిస్ట్ ఫోకస్ ఉంటుంది మరియు ‘‘నెక్ట్స్ బిలియన్’’ ఎమర్జింగ్ మార్కెట్ వినియోగదారులకు బీమాని అందించే కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. లీప్ ఫ్రాగ్ ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్ ఫండ్ అనేది రెండు విధాలుగా అసాధారణమైనది, ముందుగా ఇది సామాజిక ప్రభావంపై దృష్టి సారిస్తుంది మరియు రెండోది, ఇది బీమాపై దృష్టి సారిస్తుంది.

మీ కంపెనీ పైన పేర్కొన్న లావాదేవీ కొరకు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ మరియు డెవలప్‌మెంట్ అథారిటీ మరియు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతిని పొందింది.

పై పర్యావసానంగా, MIBL అనేది MMFSL యొక్క 85% సబ్సిడరీ. MIBLలో IRPL 15% వాటాలను తీసుకుంది.

housing

మీరు ఇల్లు అనే ప్రదేశాన్ని సృష్టించడానికి ఒక జీవితకాలం పడుతుంది. మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (MRHFL)మీ కలల ఇంటికి ప్రయాణం చేయడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది.

MRHFL, భారతదేశంలో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇది ఖర్చు తక్కువ మరియు సరళమైన గృహ రుణాలు అందించడం ద్వారా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలను పరివర్తన చెందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. అందువల్ల గృహ నిర్మాణం, కొనుగోలు, విస్తరణ లేదా మెరుగుదల కొరకు, MRHFL చాలా గృహ ఆర్ధిక అవసరాల కొరకు రుణాలను అందిస్తుంది. ఇవాళ, ఇది విజయవంతంగా 1 లక్ష మంది ఖాతాదారులకు సేవలందిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఆంద్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ వంటి రాష్ట్రాల్లోని 17,500లకు పైగా గ్రామాల్లో సేవలందిస్తోంది.

వాస్తవానికి, గ్రామీణ భారతదేశంలో కొంత ప్రధాన పరివర్తనకు MRHFL కారణంగా చెప్పవచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల వద్ద తగిన డాక్యుమెంట్‌లు లేకపోవడం వల్ల ప్రముఖ ఆర్ధిక సంస్థల నుంచి రుణం పొందేందుకు తక్కువ అవకాశాలుంటాయి. స్థానిక వడ్డీవ్యాపారాలు మరింత ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. ఇటువంటి సమయాల్లో MRHFL సహాయపడుతుంది మరియు కనీస డాక్యుమెంటేషన్‌తో చౌకగా గృహ రుణాలను ఇస్తుంది.

అనేక కచ్చా మరియు అస్థిరమైన నిర్మాణాలు పక్కా గృహాలుగా పరిణిత చెందడానికి, అలానే మట్టి ఇళ్లు ఇటుకలు మరియు మోర్టార్‌తో కట్టుకోవడానికి, అలానే ఇంటి ఫ్లోరింగ్‌ని సిమెంట్ బేస్ నుంచి టైల్స్‌కు మార్చుకోవడానికి సహాయపడింది. క్లుప్తంగా, గుడిసెలు ఇళ్లుగా మారాయి, అలానే కలలు, వాస్తవాలుగా మారాయి.

MMFSL యొక్క సబ్సిడరీగా, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏప్రిల్ 9, 2007 నాడు ప్రారంభించబడింది. ఆగస్టు 13, 2007 నాడు హౌసింగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ బిజినెస్ ప్రారంభించడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ని పొందింది. MRHFLలో మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MMFSL) 87.5% ఈక్విటీని మరియు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (NHB) మిగిలిన 12.5% వాటాని కలిగి ఉన్నాయి. NHB అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క పూర్తిగా స్వంత సబ్సిడరీ.

మా మిషన్:

"కలిసి గ్రామీణ జీవితాలను పరివర్తన చెందించడం."

అందించబడే మొత్తంఉత్పత్తుల శ్రేణిని చూడటం కొరకు దయచేసి మహీంద్రా హోమ్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌ని సందర్శించండి.

మహీంద్ర ట్రస్టీ కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్, 1956నాటి కంపెనీల చట్టం ప్రకారంగా ఏర్పాటు చేయబడ్డ కంపెనీ, ఇది మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కొరకు ట్రస్టీగా వ్యవహరిస్తుంది. మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల్లో, శ్రీ. మన్హర్ జి. భిడే - మాజీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీ. నరేంద్ర మెర్‌పడే - ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ. గౌతమ్ జి. పరేఖ్ - ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు శ్రీ. దేబబ్రతా బందోపాధ్యాయ - వ్యవస్థాపకుడు మరియు సిఈవో, టచ్‌స్టోన్ కన్సల్టింగ్. (వారి పూర్తి ప్రొఫైల్ వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి)

అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ద్వారా అప్లై చేయబడ్డ ప్రక్రియలను మరియు సిస్టమ్‌ను పరిశీలించడంలో ట్రస్టీ కంపెనీ గణనీయమైన పాత్రను పోషిస్తుంది మరియు ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యహరిస్తుంది.

మహీంద్ర అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్ అనేది, 1956నాటి కంపెనీల చట్టం ప్రకారంగా ఏర్పాటు చేయబడ్డ కంపెనీ, ఇది మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కొరకు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తుంది. ఇది మహీంద్ర అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MMFSL) పూర్తి అనుబంధ సంస్థ. MAMCPL డైరెక్టర్ల బోర్డులో వి. రవి- MMFSL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్‌వో, గౌతమ్ దివాన్ - ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ఫెలో సభ్యుడు (ICAI), ప్రొఫెసర్ జి. సేతు - డీన్ ఐఐఎం తిరుచునాపల్లి మరియు శ్రీ.అశుతోష్ బిష్ణోయి - ఎమ్‌డి & సిఈవో, MAMCPLలున్నారు.

2 ఏప్రిల్ , 2019 నాడు మహీంద్రా ఫైనాన్స్ CSR ఫౌండేషన్ మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్యం కలిగిన సబ్సిడరీ వలే ఏర్పాటు చేయబడింది, ఇది కంపెనీల చట్టం, 2013 లోని సెక్షన్ 8 ప్రకారం షేర్ల ద్వారా పరిమితం చేయబడిన లాభ సంస్థ కోసం కాదు, ఇతరత్రా ఇది విద్య, ఉపాధి, వత్తి నైపుణ్యాలు, మరియు స్థిరమైన జీవనోపాధి, నియంత్రణ మరియు నిరోధక ఆరోగ్య సంరక్షణ చర్యలు , పరిశుభ్రత మరియు సురక్షితమైన తాగునీటి లభ్యతకు మద్దతు, ప్రోత్సాహించడం మరియు మెరుగుపరచడం; ఆకలి, పేదరికం మరియు పోషకాహారలోపాన్ని నిర్మూలించే చర్యలు; స్థిరత్వమైన పర్యావరణ మరియు పర్యావరణ సమతుల్యత మొదలైన విషయాల్లో పని చేస్తుంది.

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి

Calculate Your EMI

  • Diverse loan offerings
  • Less documenation
  • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000